ఖుషి నిర్మాత పవన్ తో చేయి కలిపింది అందుకేనా..?

Friday, April 27th, 2018, 01:40:08 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అందాల న‌టి భూమిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎస్‌.జె.సూర్య తెర‌కెక్కించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలో రాయ్‌.. సిద్ధార్ధ్ రాయ్ అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికి అభిమానుల నోళ్ళ‌ల్లో నానుతూనే ఉంది. చిత్రంలో ప‌వ‌న్ మేన‌రిజం, ఆయ‌న చెప్పిన డైలాగ్స్‌, ఫైట్స్‌కి ఫిదా కాని ఫ్యాన్ లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఖుషి చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం యువ‌త‌రం ప్రేమ‌క‌థ‌ల‌కి, స్టైల్స్‌కి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. 2001 ఏప్రిల్ 27న ఈ చిత్రం నేటితో 17 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం.ఎం.మ‌ణిర‌త్నం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి భారీ పుష్ప‌గుచ్చం అందించి త‌న సంతోషాన్ని పంచుకున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం చిత్రాన్ని ఓ రేంజ్‌లో నిలిచేలా చేసింది. అమ్మాయే స‌న్న‌గా, అర‌న‌వ్వేన‌వ్వ‌గా.., చెలియ చెలియ‌…, యే మేరా జ‌హా…, లాంటి గీతాలు ప్రాచుర్యం పొందాయి. ఇక ఆడవారి మాట‌ల‌కి అర్ధాలే వేరులే అనే అల‌నాటి గీతం రీమిక్స్ వ‌ర్షెన్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి