అతడి తో డేటింగ్ చాలా మంది చేశారట..సీక్రెట్ బయట పెట్టిన లక్ష్మిరాయ్ !

Wednesday, September 28th, 2016, 10:57:06 AM IST

rai-lakshmi
మహేంద్ర సింగ్ ధోని, హీరోయిన్ లక్ష్మి రాయ్ ల మధ్య అప్పట్లో ఏం జరిగింది ? నేషనల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.ఎందుకంటే ఎం ఎస్ ధోని చిత్రం విడుదల దగ్గరపడుతోంది.అప్పట్లో ఐపీఎల్ సందర్భగా 2008 లో ధోని, లక్ష్మీ రాయ్ లు ప్రేమలో ఉన్నారంటూ, వారు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ప్రస్తుతం లక్ష్మిరాయ్ సంచలన కామెంట్స్ చేసింది.ధోని తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకుంది.అంతే కాదు ధోని డేటింగ్ లిస్ట్ లో చాల మందే ఉన్నారంటూ షాకిచ్చింది.

అప్పట్లో ధోని తో కిన్నిరోజులు డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని లక్ష్మీరాయ్ ప్రకటించింది.అయితే అది అప్పట్లోనే ముగిసిందని, దానిగురించి ఇంకా ఎందుకు చర్చించుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధోని, తాను ఎప్పుడూ పెళ్లిచేసుకోవాలని అనుకోలేదని అంది. అయినా ధోని తన తో మాత్రమే కాక చాలా మందితో డేటింగ్ చేశాడంటూ బాంబు పేల్చింది.ప్రస్తుతం వస్తున్నఎం ఎస్ ధోని చిత్రం లో తన ప్రస్తావన ఉండదనే అనుకుంటున్నట్లు తెలిపింది.అయినా ధోని జీవితం అంటే కేవలం అమ్మాయిలు మాత్రమే కాదని అంది.