‘లార్గో వించ్’ దర్శకుడు ‘అజ్ఞాతవాసి’ని చూసేశాడు..ఆ విషయం తేల్చేశాడు..!

Wednesday, January 10th, 2018, 10:44:22 AM IST

అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కు కాపీ అనే వివాదం ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. లార్గో వించ్ హక్కులని టి సిరీస్ సంస్థ కొనుగోలు చేసింది. అజ్ఞాతవాసిలో ఈ చిత్ర సన్నివేశాలు ఉన్నాయనే అనుమానాలతో వివాదం మొదలైంది. డబ్బు చెల్లించి ఈ వివాదాన్ని సెటిల్ చేసారు. కాగా అజ్ఞాతవాసి గురించి తెలుసుకున్న లార్గో వించ్ దర్శకుడు ఈ చిత్రం చూడడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.

అన్నట్లుగానే ఆయన అజ్ఞాతవాసి చిత్రాన్ని చూశారు. లీబ్రాడి లో అజ్ఞాతవాసి చిత్రం చూసాక ఆయన ట్విట్టర్ లో స్పందించారు. లీ బ్రాడీ లో అజ్ఞాతవాసి చిత్రం చూశా. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా చిత్రం నచ్చింది. నా లార్గో వించ్ కథకు, అజ్ఞాతవాసి చిత్ర కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారు.