లేటెస్ట్ : భరత్ ఆడియో ఈవెంట్ సెట్ 3డి లో అదరహో!

Friday, April 6th, 2018, 10:17:16 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎంఎస్ ధోని సినిమా ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మాతగా, వస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను. ఇటీవల ఈ చిత్రంలోని ఫస్ట్ ఓత్, ది విజన్ అఫ్ భరత్, అలానే మొన్న విడుదలయిన ఈ సినిమాలోని మూడుపాటలు యూట్యూబ్ లో పలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అయితే రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా అంగరంగ వైభవంగా భరత్ బహిరంగ సభ పేరిట ఆడియో విడుదల కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం లో ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే స్టేడియంలో అసెంబ్లీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఆ సెట్ కు సంబందించిన 3డి వెర్షన్ ని నేడు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేసింది. అచ్చం అసెంబ్లీని పోలి వున్న ఆ సెట్, కార్యక్రమానికి విచ్చేసే ప్రతిఒక్కరిని ఆకట్టుకోకమానదు అని తెలుస్తోంది. అయితే ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన లింక్ లో మీరు కూడా ఆ సెట్ 3డి వెర్షన్ ని చూసి ఆనందించండి….