లేటెస్ట్ : చీఫ్ మినిస్టర్ సూపర్ స్టార్స్ నాడు-నేడు!

Tuesday, April 17th, 2018, 05:16:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో డివివి దానయ్య నిర్మిస్తున్న కొత్త సినిమా భరత్ అనే నేను. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా విడుదలకు ముందే అద్భుత క్రేజ్ సంపాదించింది. ఎమ్ ఎస్ ధోని ఫేమ్ కైరా అద్వానీ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టిన మహేష్ కొరటాల కాంబినేషన్ కావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.

అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ముఖ్యమంత్రి అనే సినిమాలో ఇదే తరహా పాత్ర చేసి అభిమానులను అలరించారు. అప్పట్లో ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ప్రస్తుతం కృష్ణ గారు నటించిన ఆ సినిమాలోని ఒక స్టిల్ ని ఇపుడు మహేష్ నటించిన భరత్ అనే నేను లోని స్టిల్ ని పోల్చి ఒక ఫోటో క్రియేట్ చేసారు.

నాడు తండ్రి పోషించిన ఈ పాత్రను నేడు కుమారుడు పోషించడం, అలానే ఆ సినిమాలనే ఈ సినిమాకూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ వారిద్దరూ కలిసివున్న ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో పై ఒక లుక్ వేయండి….

  •  
  •  
  •  
  •  

Comments