బ్రేకింగ్ : తెలంగాణాలో మరోసారి భారీ ఎత్తున కరోనా కేసులు.!

Wednesday, July 29th, 2020, 11:40:24 AM IST

ఇప్పుడు మన రేణుడి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండగా తెలంగాణాలో మాత్రం కాన్స్టెంట్ గా అలా పెరుగుతూనే ఉన్నాయి. అలా గత 24 గంటల్లో నమోదు కాబడిన కేసులు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త బులిటెన్ ద్వారా విడుదల చేసారు.

ఈ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో 18 వేల 858 శాంపిల్స్ పరీక్షించగా అందులో భారీ ఎత్తున 1,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 58 వేల 906 కు చేరుకున్నాయి. అయితే గత 24 గంటల్లోనే 842 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా 12 మంది మృత్యువాత పడ్డారు. అలాగే జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పాలి. అక్కడ మొత్తం 509 కేసులు నమోదు కాగా మల్కాజ్ గిరిలో 158 రంగారెడ్డిలో 157 కేసులు భారీ ఎత్తున నమోదు అయ్యాయి.