మహానటి లో దర్శకులకు కూడా పాత్రలు దక్కాయి.. అందులో కూడా దర్శకులేనట

Saturday, October 21st, 2017, 06:44:39 PM IST

వెండితెరపై తన నటనతో అభినయంతో ఆకట్టుకున్న మహానటి సావిత్రి. టాలీవుడ్ లోనే కాకూండా కోలీవుడ్ లో కూడా ఆ రోజుల్లో ఆమె చేసిన పాత్రలు ఎంతో గుర్తింపు పొందాయి. అయితే ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆమె జీవితాన్ని ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి నుంచి పాత్రల విషయంలో ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

అయితే రీసెంట్ గా మరొక న్యూస్ వైరల్ అవుతోంది. సావిత్రి నటించిన మాయాబజార్ సినిమాలోని వివాహభోజనంబు పాటలో ఎస్వీ రంగారావు పాత్రను మోహన్ బాబు చేశారట. అయితే ఆ సినిమాలో మయాబజార్’ సినిమాకి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించనున్నారట. ఇక అప్పట్లో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సింగీతం శ్రీనివాసరావు పాత్రలో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కనిపించనున్నారని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాలో ప్రకాష్ రాజ్ – దుల్కర్ సల్మాన్ , సమంత నటిస్తున్నారు. ఇక మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.