లేటెస్ట్ : చరణ్ – ఎన్టీఆర్ సినిమా పై ఆ న్యూస్ నిజమేనట!

Wednesday, April 11th, 2018, 01:13:57 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా దర్శక ధీరులు రాజమౌళి దర్శకత్వం లో డివివి దానయ్య నిర్మిస్తున్న అతి పెద్ద మల్టీ స్టారర్ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ, స్క్రిప్ట్ పనులు అతి త్వరలో పూర్తి అవుతాయని తెలుస్తోంది .అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నారని అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అలానే ఈ సినిమాని రాజమౌళి ఎక్కడ కంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట.

కాగా ఈ సినిమాకు ఖర్చు దాదాపు రూ.250 కోట్లు అవుతుందని కూడా వార్తలొచ్చిన నేపథ్యంలో, కొందరు టాలీవుడ్ ప్రముఖులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. నిజానికి చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, వీరి ముగ్గురి రెమ్యూనిరేషన్ లు రూ.75 కోట్లవరకు అవుతుందట. ఇక మిగతాది సినిమాకి సినిమాలో ఇతర నటీనటులకు, సాంకేతికనిపుణులు మరియు సింహభాగం సినిమా బడ్జెట్ కి అయ్యే ఖర్చు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా బాహుబలి ది కంక్లూజన్ ని మించి ఈ సినిమాకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాహుబలి సినిమాతో రాజమౌళి ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎగబాకిన నేపథ్యంలో ఆయన సినిమాకి ఈ మాత్రం ఖర్చు అవసరమని, అదీకాక సినిమాని భారీ స్థాయిలో ముఖ్యమైన భాషల్లో విడుదల చేస్తారు కనుక ఈ మాత్రం ఖర్చు తప్పదని పలువురు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments