అక్కడ షూటింగ్ ముగించేసిన చరణ్ ?

Tuesday, October 2nd, 2018, 10:08:45 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియా కి వస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అయన యూరప్ లోని అజర్ బైజాన్ ప్రాంతంలో షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అజర్ బైజాన్ లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపడంతో పాటు ఓ భారీ యాక్షన్ సీన్ కూడా షూట్ చేశారట. ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా ఎనభై శాతం పూర్తయినట్టే. మిగిలిన షూటింగ్ ని హైద్రాబాద్ లో చిత్రీకరిస్తారట. రంగస్థలం సినిమాతో 200 కోట్ల హీరోగా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న చరణ్ నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ సరసన ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా తమిళ నటుడు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అంటూ మెగా ఫాన్స్ లో ఒకటే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగదేకవీరుడు, స్టేట్ రౌడీ లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి .. కానీ ఈ టీమ్ మాత్రం ఓ సరికొత్త టైటిల్ కోసం అన్వేషిస్తుంది. దసరా రోజున ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట. వచ్చే సంక్రాంతి సందర్బంగా చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయనున్నారు.