షాకింగ్ న్యూస్ : రాంగోపాల్ వర్మ కి శ్రద్ధాంజలి – వైరల్ అవుతున్న ఫోటో

Saturday, December 14th, 2019, 01:13:01 PM IST

నిత్యం వివాదాలతో సహవాసం చేసే ప్రాముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు… కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో వివాదాలను మూటగట్టుకుంది. చివరికి ఎన్నో వివాదల నడుమన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా విడుదలైన అన్ని చోట్ల కూడా ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకొని, ఇప్పటికి కూడా విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది.

అయితే ఈ చిత్రంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతీ నాయకుడిని బాగా వాడుకున్నాడు. అయితే ఈ చిత్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని రకాల విమర్శలను చేశారు. కాగా అయితే ఈ విషయంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, వర్మ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేసారు. అయితే వైరల్ గా మారినటువంటి ఆ పోస్టు ని వర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేస్తూ, “మీ లీడర్ నీ దెయ్యమై పట్టుకోవడానికి ఆత్మగా త్వరలో వస్తున్న” అంటూ రిప్లై కూడా చేశారు. చివరికి ఇది కూడా వైరల్ గా మారింది.