బిగ్ బ్రేకింగ్ : గంటా విషయంలో వైరల్ అవుతున్న సంచలన మ్యాటర్ ఇదే.!

Monday, October 14th, 2019, 02:47:47 PM IST

గత కొన్ని రోజుల నుంచి కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో కీలక రాజకీయ నేత ఈఅటువంటి గంటా శ్రీనివాస్ పై రోజుకొక కొత్త వార్త బయటకు వస్తూనే ఉంది.ఎప్పుడూ పవర్ ఉండే పార్టీలో ఉండే గంటాకు ఈసారి కాలం కలిసిరాలేదు తనకు గెలుపొందినా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే మినిస్ట్రీ కూడా గంటాకు రాకపోవడం వంటివి కాస్త నిరాశపరిచాయి.ఇక అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇక తన రాజకీయ భవిష్యత్తు ఇందులోనే ఉంటే కష్టమే అని వైసీపీలోకి చేరిపోతున్నారు అన్న వార్త ఈ మధ్య గట్టిగా ఊపందుకుంది.

కానీ చివరి నిమిషంలో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.ఎందుకంటే ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి జూపూడి చేరారు దానితో కాస్త వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.ఈ సమయంలో చేరడం కరెక్ట్ కాదని భావించే చేరలేదని కూడా తెలిసింది.అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి మరియు గంటాకు ఉన్న సాన్నిహిత్యం కోసం అందరికి తెలిసిందే.అయితే ఎలాంటి పబ్లిక్ ఫంక్షన్ అయినా సరే గంటా చిరుతో కలిసి ఉండడం మనం అనేక సార్లు చూసాం.కాకపోతే ఈ రోజు చిరు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను కలిసేందుకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే.

కానీ ఈ మీటింగుకు గంటా కూడా హాజరు కావాల్సి ఉందని కాకపోతే ఇప్పుడు కావాలనే ఈ మీటింగును గంటా దాటవేశారన్న మాట వినిపిస్తుంది.తర్వాత చిరుతో ఢిల్లీ పర్యటన చేస్తారని ఆ తర్వాత వచ్చాక మళ్ళీ వైసీపీలోని కొంతమంది కీలక నేతలతో మరోసారి మంతనాలు జరుపనున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.ఇలా గంటా వైసీపీలోకి వద్దామని ఎన్ని దారులు వెతుక్కుంటున్నా సరే జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతని ఎమ్మెల్యే పదవికి సహా టీడీపీకు రాజీనామా చేస్తేనే పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని చెప్తున్నట్టు సమాచారం.