లేటెస్ట్ న్యూస్ : నాకు కాబోయే భర్త అతడే!! కన్ఫర్మ్ చేసిన నయనతార…

Saturday, March 24th, 2018, 04:28:17 PM IST


గత కొద్దీ కాలంగా ప్రముఖ హీరోయిన్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో కలిసి ప్రేమాయణం సాగిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు, అలానే పత్రికలు ప్రచారం చేశాయి. అయితే అదేమి లేదని, తామిద్దరి మధ్య వుంది కేవలం స్నేహమేనని నయనతార ఖండించారు. అయితే కొన్నాళ్ల క్రితం ఇద్దరు కలిసి ఒక ఫారిన్ ట్రిప్ లో భాగంగా వాళ్లిద్దరూ దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారి సంచలనం సృష్టించాయి కూడా. అయితే వీటిపై విగ్నేష్ ని మీడియా ప్రశ్నించగా, అది నేను చెప్పలేను, మీరే నయన్ ను అడగండి అని ఆయన చెప్పారు.

ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్‌ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం, వాటిని నయనతార ఖండించటం చూశాం. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్‌షిప్‌ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి. ఇక నిన్న శుక్రవారం ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న నయన్‌, ఈ అవార్డుకు కారణమయిన తన తల్లిదండ్రులకు, సోదరుడికి, అలానే కాబోయే భర్త విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న వార్త ఆవిడ కన్ఫర్మ్‌ చేసినట్లయింది…..