అరవింద సమేత కోసం స్టార్ హీరోలు వస్తున్నారా?

Sunday, September 9th, 2018, 11:18:36 AM IST

టాలీవుడ్ లో హీరోలు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ గతంలో అభిమానులకు తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం కారణంగానో లేక హీరోల్లో మార్పు వచ్చిందో తెలియదు గాని ఒక ఫ్రెమ్ లో కనిపిస్తూ అభిమానుల్లో మంచి వాతావరాన్ని నెలకొల్పుతున్నారు. అంతే కాకుండా సినిమాలకు సంబందించిన వేడుకలలో కూడా పాల్గొంటూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే అరవింద సమేత సినిమాకు కూడా ఇద్దరు స్టార్ హీరోలు స్పెషల్ గెస్ట్ లుగా రానున్నట్లు తెలుస్తోంది.

హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ ఎక్కువగా ఎన్టీఆర్ తో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి బాధ్యతలో ఉండి అరవింద సమేత ఆడియో వేడుకకు రానున్నట్లు టాక్ వస్తోంది. అదే విధంగా భరత్ అనే నేను సినిమాకు ఎన్టీఆర్ మహేష్ కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ కూడా తారక్ కోసం ఈవెంట్ కు హాజరుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ వార్తపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments