హీరోకి గాయం.. రూ.550 కోట్లు పెరిగిన బడ్జెట్!

Thursday, July 26th, 2018, 07:35:34 PM IST

ఒక సినిమా తెరకెక్కించాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా నిర్మాతలకు సినిమా షూటింగ్ ముగిసే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందరిని ఆకట్టుకోవాలని కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. ఇక యాక్షన్ కు సంబందించిన సినిమాల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు షూటింగ్ ఎండ్ అయ్యే వరకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఇక హాలీవుడ్ లో సినిమాల గురించి అందరికి తెలిసే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం గట్టిగా ఖర్చు చేస్తుంటారు.

ఇకపోతే ఇటీవల ఒక చిత్ర యూనిట్ చెప్పిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం హీరోగారికి దెబ్బ తగలడం వలన 80 మిలియన్ల డాలర్లను అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందట (మన ఇండియన్ కరెన్సీలో 550 కోట్లు). ఇంత భారీ మొత్తం ఖర్చు చేసింది మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌ సినిమా కోసం. టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా నటించినక్ ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో టామ్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించాడు.

అయితే ఒక సన్నివేశం చిత్రీకరణలో బిల్డింగ్ పై నుంచి మరొక బిల్డింగ్ పైకి దూకుతున్న సమయంలో టామ్ కాలికి దెబ్బ తగిలింది. గాయం కారణంగా కొన్ని రోజుల వరకు హీరో సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పాల్సి వచ్చిందట. దీంతో చిత్ర యూనిట్ సెట్ చేసుకున్న షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దాంతో ఊహించని విధంగా సినిమా బడ్జెట్ పెరిగింది. మొత్తంగా మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌ కోసం 250 మిలియన్‌ డాలర్ల(రూ.1,700)ను ఖర్చు చేశారు. మరి రిలీజ్ తరువాత సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments