సాహో సినిమాకు అప్పుడే అన్ని కోట్లా?

Friday, April 13th, 2018, 11:14:44 AM IST


బాహుబలి సినిమా తరువాత దేశ వ్యాప్తంగా ఆదరణను అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు చాలానే ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఇతర సినిమా అభిమానుల్లో కూడా సాహోపై అంచనాలు పెంచుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సాహో సినిమాను భారిగా రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. అయితే ఇంతలోనే సినిమా హిందీ వెర్షన్ థ్రియేటికల్ హక్కులను భారీ ఎమౌండ్ కు ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ దక్కించుకుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ కు దాదాపు 120 కోట్ల వరకు అఫర్ చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా హిందీలో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సాహో సినిమా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ హిందీ నటులు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సుజిత్ దర్శకుడు.

  •  
  •  
  •  
  •  

Comments