క‌బ‌డ్డీకి కార్తికేయ‌, కొర్ర‌పాటి ప్రోత్సాహం

Saturday, September 15th, 2018, 04:09:51 PM IST

ఎన్ని ఆట‌లు ఉన్నా క‌బ‌డ్డీ ఆట‌కు ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. ఇందులో ఎన్నో ఎమోష‌న్స్ ఉంటాయి. ప్ర‌తి ప‌ల్లెలోనూ ఆడుకునే ఆట ఇది. అయితే క్రికెట్ మ‌త్తులో ప‌డి ఆ ఆట గొప్ప‌త‌నాన్ని మ‌న యువ‌త మ‌ర్చిపోతున్నారు. అయితే ఇలాంటి ఆట‌కు మ‌న టాలీవుడ్ సెల‌బ్రిటీలు అండ‌గా నిల‌వ‌డం ప్ర‌శంస‌నీయ‌మైన‌ది.

క్రీడ‌ల‌కు సినీసెల‌బ్రిటీల ప్రోత్సాహాన్ని మెచ్చుకుని తీరాలి. ముఖ్య ంగా ఆట అంటే కేవ‌లం క్రికెట్ ఒక్క‌టే అనుకునే యువ‌జ‌నానికి క‌బ‌డ్డీ, కోకో, వాలీబాల్ లాంటి సాంప్ర‌దాయ‌క క్రీడ‌ల్ని ఇటీవ‌లి కాలంలో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇవి కూడా ఆట‌లే .. ఆడండి బాబూ! అని గుర్తు చేస్తున్నారు. యువ‌హీరోలు రానా, శ్రీ‌కాంత్, త‌రుణ్ లాంటి వాళ్ల నుంచి క్రీడ‌ల‌కు బోలెడంత ప్ర‌చారం ద‌క్కుతోంది. ఇక‌పోతే ద‌ర్శ‌కుల్లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో భార‌త‌దేశం సాధించే ప‌త‌కాలపై మెప్పుకోలు వ్యాఖ్య‌లు చేస్తారు. ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హిస్తారు. జ‌క్క‌న్న‌ త‌న‌యుడు కార్తికేయ సైతం క్రీడాభిమాని. క్రికెట్‌, క‌బ‌డ్డీ వంటి ఆట‌లంటే చెవి కోసుకుంటాడు. అలానే నిర్మాత‌ల్లో వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి క్రీడ‌లంటే ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి వార‌సుడు కార్తికేయ‌తో క‌లిసి న‌ల్గొండ ఈగిల్స్ క‌బ‌డ్డీ టీమ్‌కి ఆయ‌న బ్యాక‌ప్ అందిస్తున్నారు. ఇటీవ‌లే తెలంగాణ ప్రీమియ‌ర్ క‌బ‌డ్డీ (టీపీకె) సీజ‌న్ 2 టోర్నీకి ఆ ఇరువురూ బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్స‌వ వేడుక‌లో న‌ల్గొండ ఈగిల్ టీమ్‌తో నిర్మాత సాయికొర్ర‌పాటి ఇదిగో ఇలా ఫోటో దిగారు. దానిని కార్తికేయ త‌న ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌కు షేర్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments