సెంటిమెంట్ తో సైరా రిలీజ్ డేట్ ఫిక్స్?

Tuesday, May 8th, 2018, 03:09:11 PM IST

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ గా రాబోతోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాత రామ్ చరణ్ కలిసి సినిమా రిలీజ్ డేట్ పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే 9న సినిమాను రిలీజ్ చెయ్యాలని భావించారట. మెగాస్టార్ కి అది బాగా కలిసొచ్చిన డేట్. గ్యాంగ్ లీడర్ – జగదేకవీరుడు అతిలోక సుందరి అదే రోజున విడుదలై ఆయనకు మంచి హిట్స్ ఇచ్చాయి. అందుకే సైరా కోసం ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

అయితే సినిమాకు గ్రాఫిక్స్ చాలా అవసరం. దానికే సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే యాక్షన్ సీన్స్ కి కూడా టైమ్ ఎక్కువగానే పడుతుంది. ఆ విధంగా చూసుకుంటే అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయడమంటే పెద్ద సాహసమే. షూటింగ్ లో ఏ మాత్రం గ్యాప్ వచ్చినా విడుదల తేదీ వాయిదా పడుతుంది. అందుకే దర్శకుడు సినీ షూట్ చేసిన తరువాత అందుకు సంబందించిన విజువల్ ఎఫెక్ట్ పనులను కూడా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఆ విధంగా చేసుకుంటూ వీలైనంత త్వరగా వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసేవిధంగా ప్రణాళికలు రచించారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments