తాజా వార్త : వారికి రంగమ్మత్త పసందైన విందు!

Friday, April 6th, 2018, 02:27:11 PM IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్‌ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ రంగస్థలం. గత వారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో రాంచరణ్‌, సమంతతో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కూడా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

ఆమెపై ప్రతిఒక్కరినుండి ప్రశంశల జల్లు కురుస్తోంది. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్‌ని తనకిచ్చినందుకు సుకుమార్‌కి ఆమె కృతజ్ఞలు తెలిపారు కూడా. చిత్ర విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న అనసూయ తాజాగా, రంగస్థలం టీంకు విందు భోజనం ఇచ్చారట. రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు ‘రంగమ్మత్త విందు భోజనం’ అంటూ అందరూ కలిసి ఉన్న ఓ ఫోటోను ట్వీట్‌ చేశారు. ‘రంగమ్మత్త విందు భోజనం మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ కామెంట్‌ కూడా పెట్టారు.

ఈ ట్వీట్‌కు అనసూయ ‘సచ్ లవ్‌లీ టైమ్’ అని సమాధానమిస్తూ రీట్వీట్‌ చేశారు. రంగస్థలం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న ఈ ఫొటో నెటిజన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంతో రంగస్థలం తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ విధంగా తన కృతజ్ఞత చాటుకున్న రంగమ్మ అత్తను తెగ మెచ్చుకుంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments