తాజా వార్త : సూపర్ టైటిల్ తో వస్తున్న సుమంత్ సూపర్ హిట్ కొడతారా?

Sunday, April 1st, 2018, 05:39:39 PM IST

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి నటవారసత్వం తో మేనమామ అక్కినేని నాగార్జున ఆశీస్సులతో టాలీవుడ్ కి పరిచయమయిన హీరో సుమంత్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన ప్రేమ కథ చిత్రం తో ఆయన తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అప్పటినుండి ఆయన కెరీర్ చాలా వరకు ప్లాప్ లతో సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన సత్యం చిత్రం తో ఆయన మంచి బ్రేక్ అందుకున్నారు. అయితే మల్లి ఆయన్ని పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి.

అయితే మళ్లి ఇన్నాళ్లకు ‘మళ్లి రావా’ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా కథ, కథనాల పరంగా మంచి పేరు సంపాదించింది ఆ సినిమా. అయితే ఆయన వెంటనే ఓ సినిమా మొదలుపెట్టారు. ఆ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ రోజు ఆ చిత్ర టైటిల్ ప్రకటించారు. ‘ఇదం జగత్’ అనే వెరైటీ ఇంట్రెస్టింగ్ టైటిల్ అది. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఇంకో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు. అనిల్ శ్రీకంఠం అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డబ్బు చుట్టూ సాగే థ్రిల్లర్ మూవీ ఇదని సమాచారం.

మరోవైపు సుమంత్ ఇటీవలే ‘సుబ్రమణ్యపురం’ అనే కొత్త సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కొంచెం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కబోతోంది. అందులో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. సంతోష్ జాగర్లమూడి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వరుసగా కొత్త దర్శకులతోనే సుమంత్ జట్టు కడుతుండటం విశేషం. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఆయన మల్లి ఫామ్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి…

  •  
  •  
  •  
  •  

Comments