అప్పుడే AA19 పై వైరల్ అవుతున్న లేటెస్ట్ రూమర్స్.!

Sunday, June 9th, 2019, 02:30:11 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండో షెడ్యూల్ కూడా ఇటీవలే మొదలయ్యింది.ఈలోపలే అప్పుడే ఈ సినిమా పియా కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది అన్నది గురూజీ ఇంకా వెల్లడించలేదు.కానీ ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాదిలోనే విడుదలవుతుందని కొందరు,అలాగే ఈ ఏడాదిలోనే నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల అవుతుందని మరికొందరు అంటున్నారు.

ఇవొక్కటే కాకుండా ఈ సినిమాను బన్నీ మొట్టమొదటి సారిగా ఏకకాలంలో నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరెకెక్కించనున్నారని కూడా వార్తలొస్తున్నాయి.తెలుగు,హిందీ, తమిళ్ మరియు మలయాళం భాషల్లో విడుదల కానుందని దీనిపై అధికార ప్రకటన ఒకటి రావడమే మిగిలి ఉందని మరికొందరు అంటున్నారు.మరి మొత్తానికి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.