క్యాన్సిల్‌: ఇంత‌కీ `సంఘ‌మిత్ర‌` ఉందా? లేదా?

Monday, September 25th, 2017, 02:09:48 PM IST

`బాహుబ‌లి` సిరీస్ ఘ‌న‌విజ‌యంతో ఆ త‌ర‌హా భారీ ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌న‌పై సౌత్‌లో కాంపిటీష‌న్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఇమ్మీడియ‌ట్ ఎటెంప్ట్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్.సి నుంచే క‌నిపించింది. అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో అసాధార‌ణ స్కేల్‌తో `సంఘ‌మిత్ర‌` తెర‌కెక్కిస్తున్నానంటూ సుంద‌ర్ ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే టైటిల్ పాత్ర‌కు శ్రుతిహాస‌న్‌ని ఎంపిక చేసుకుని ఫోటోషూట్ చేశారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్‌లో ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేశారు. అయితే ఆ త‌ర్వాత ఊహించ‌ని రీతిలో ఆ ప్రాజెక్ట్ నుంచి శ్రుతి త‌ప్పుకుంది. అటుపై ర‌క‌ర‌కాల పేర్లు టైటిల్ పాత్ర‌కు వినిపించాయి కానీ ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్ప‌టికీ ఆ ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ రాక‌పోవ‌డంతో సంఘ‌మిత్ర ఉన్నట్టా? లేన‌ట్టా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి.

ఇలాంటి టైమ్‌లో సుందర్.సి చేసిన ఓ ప్ర‌క‌ట‌న మ‌రింత‌గా అనుమానాలు రేకెత్తిస్తోంది. సుంద‌ర్ సి తెర‌కెక్కించిన బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `కలగలప్పు`కి సీక్వెల్‌గా `కలగలప్పు-2` తీస్తున్నాన‌ని ప్రకటించడంతో `సంఘమిత్ర` ఇక లేన‌ట్టేనా? అంటూ ఒక‌టే ముచ్చ‌ట్లు మొద‌ల‌య్యాయి. జీవా, జై కథానాయకులుగా కేథరిన్, నిక్కీ గల్రాని కథానాయికలుగా `కలగలప్పు-2` ని తెర‌కెక్కించేందుకు సుంద‌ర్ సి స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో `సంఘమిత్ర` ఆగిపోయిందా? కేవ‌లం బ్రేక్ మాత్ర‌మే వేశారా? అన్న‌ది తేలాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments