ఆడవాళ్లకే కాదు మగవారికి లైంగిక వేధింపులు ఉంటాయ్..#మెన్ టూ బాధితులు.!

Tuesday, October 23rd, 2018, 01:44:58 PM IST

గత కొద్ది రోజులు నుంచి మనదేశం లో మహిళలు సినీ నటుల నుంచి రాజకీయ నాయకులు వరకు క్రీడాకారులు నుంచి సాధారణ స్త్రీల వరకు తాము ఎన్నో సార్లు లైంగిక వేధింపులకు గురి కాబడ్డ వాళ్ళమే అని #మీటూ బాధితులం అంటూ సంచలనానికి తెర లేపారు అన్న సంగతి తెలిసినదే.అయితే ఇప్పుడు తాజాగా మగవారి వల్ల బాధలు పడ్డవారే కాదు ఆడవారి వల్ల వేధింపులకు గురైన మగవాళ్ళు కూడా ఉన్నారంటూ మనదేశం లోని అలా వేధింపులకు గురి కాబడ్డ పురుషులు బయటకి వస్తున్నారు.

తాము #మీటూ బాధితులకు వ్యతిరేకంగా పోరాడటం లేదని,ఆడవారిలాగానే మాకు కూడా బాధలు ఉంటాయని #మెన్ టూ అనే పేరిట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సంఘటన బెంగళూరు కి చెందిన క్రిస్ప్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఈ #మెన్ టూ అనే ఉద్యమం వెలుగులోకి వచ్చింది.#మీటూ బాధితుల యొక్క ఉద్యమాన్ని మేము స్వాగతిస్తున్నామని అంతే కానీ వారికి పోటీగా అయితే మేము ఈ నిరసనను వ్య్కస్తాం చేయట్లేదని తెలిపారు.అన్యాయంగా ఆడవారు మగవారి మీద పెట్టే అక్రమ కేసులు,వారి నుంచి మగవారి మీదకు వచ్చే లైంగిక వేధింపులకు వ్యతిరేఖంగా #మెన్ టూ ఉద్యమాన్ని మేము చేపట్టామని తెలిపారు.