AA19 నుంచి లేటెస్ట్ అప్డేట్.!

Tuesday, June 4th, 2019, 03:45:05 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇదిలా ఉండగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇతర సినిమా ఇండస్ట్రీ నుంచి అగ్ర నటులు తప్పకుండా కనిపిస్తారు.అందులో భాగంగానే ఈ సినిమాలో టబు కూడా ఉన్నారని తెలిసింది.తాజాగా ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నారట.

అతనే మలయాళ మరియు తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు జయరాం సుబ్రమణ్యం.తాను కూడా ఈ చిత్రంలో నటించబోతున్నాని ఆయన పేస్ బుక్ ఖాతా ద్వారా ఆయనే స్వయంగా తెలియజేసారు అంతే కాకుండా అల్లు అర్జున్ కొత్త మూవీ తాలూకా అప్డేట్ కూడా చాలా తొందరలోనే రానుంది అని కూడా వెల్లడించారు.దీనితో బన్నీ అభిమానులు రంజాన్ సందర్భంగా అధికారిక అప్డేట్ ఇస్తారు అని అనుకుంటున్నారు.ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.