బన్నీ అతనికే ఫిక్స్ అయ్యాడా?

Friday, April 6th, 2018, 01:06:04 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. సరైనోడు సినిమాతో యూట్యూబ్ లో కూడా రికార్డులను క్రియేట్ చేసిన బన్నీ ఇప్పుడు నా పేరు సూర్య సినిమాతో కూడా అదే తరహాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఆ సినిమాపై ప్రస్తుతం అంచనాలు మాములుగా లేవు. ఫస్ట్ ఇంపాక్ట్ తో పాటు రిలీజ్ అయిన పాటలు కూడా సంచలనం సృష్టించాయి.

ఇకపోతే ఆ సినిమా తరువాత బన్నీ ఏ సినిమా చేస్తాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం క్షణం సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా బన్నీ ఆ కథను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు. ఇక నా పేరు సూర్య సినిమా పనులు పూర్తయితే ఆ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా తెలిపే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆ సప్రాజక్ట్ తో పాటు కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments