మెగా అల్లుడు కి హీరోయిన్ సెట్ అయ్యింది?

Thursday, January 11th, 2018, 02:00:25 PM IST

గత కొంత కాలంగా మెగా అల్లుడు కళ్యాణ్ సినిమాల్లోకి రాబోతున్నాడని వార్తలు ఓ రేంజ్ లో వస్తోన్న సంగతి తెలిసిందే. జతకలిసే దర్శకుడు రాకేష్ శశి దర్శకుడిగా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో గాని సినిమా గురించి రోజుకో కొత్త న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. సాయి కొర్రపాటి నో నిర్మించే ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కథను విన్న మెగాస్టార్ చాలా బావుందని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. మేఘా ఆకాష్ నితిన్ తో ఇంతకుముందు లై సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదే ఆమెకు తొలి సినిమా. నెక్స్ట్ సినిమా కూడా నితిన్ తోనే చేస్తోంది. కృష్ణ చైతన్య ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ తో నటించేందుకు కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ మంత్ సినిమాను మొదలు పెట్టనున్నట్లు మెగా సన్నిహితులు చెబుతున్నారు. మరి మెగా అల్లుడు ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.