బన్నీ ఎంట్రీ కోసం 20 లక్షల ఖర్చు!

Thursday, April 26th, 2018, 06:04:28 PM IST

మెగా ఫ్యాన్స్ కు రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో సరికొత్త బూస్ట్ ఇచ్చాడు. అయితే అదే తరహాలో విజయాన్ని కంటిన్యూ చేయాలనీ బన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నా పేరు సూర్య సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేయాలనీ అనుకుంటోంది. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఇకపోతే హీరో అల్లు అర్జున్ స్టేజ్ పైకి వచ్చేటప్పుడు సరికొత్త స్టైల్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దాదాపు 20 లక్షల ఖర్చుతో జిమ్నాస్టిక్స్ ను జోడిస్తూ బన్నీ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారట. ఎంతో ప్రయోగంతో ఆయన స్టేజ్ పైకి వస్తాడని అందరిని తప్పకుండా ఆ ఎంట్రీ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments