ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ అందుకే తప్పుకున్నాడా?

Saturday, April 28th, 2018, 01:09:40 PM IST

సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎంతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు. అయన బయోపిక్ ని తనయుడు బాలయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా దర్శకుడు తేజ తన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఫైనల్ గా బాలయ్య స్వీయ దర్శకత్వంలోనే సినిమా రానుందని అంతా అనుకుంటున్నారు. ఇకపోతే దర్శకుడు తేజ సడన్ గా సినిమా నుంచి తప్పుకోవడం ఏమిటి అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దర్శకుడు తేజ తన విషయంలో చాలా క్లారిటీగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒక్కసారిగా కథ ఫిక్స్ చేసుకున్నాడు అంటే దాన్ని తెరకెక్కించే వరకు ఎవరు ఎంత చెప్పినా కూడా మార్చడానికి ఒప్పుకోరు. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ఏమిటంటే.. ఎన్టీఆర్ జీవితం అనేది ఎన్నో ఊహించని మలుపులతో కూడుకున్నది. వెన్నుపోట్ల గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు. ఆ తరువాత సంక్షోభం నుంచి ఎన్టీఆర్ ఏ విధంగా పైకొచ్చారు. సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే లక్ష్మి పార్వతి ఎపిసోడ్. చివరి రోజుల వరకు ఎన్టీఆర్ గడిపిన క్షణాలను తెరపై చూపించాలని తేజ ఒక ప్లాన్ వేసుకున్నాడట.

అయితే బాలకృష్ణ మాత్రమే దనుకు ఏ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. కేవలం ఆయన కెరీర్ మొదటి నుంచి పార్టీని స్థాపించి సీఎం అయ్యే వారికీ చూపించాలని బాలయ్య చెప్పారట. అందుకు ఒప్పుకొని తేజ ప్రధాన అంశాలు లేకపోతే బయోపిక్ అనే దానికి అర్ధముండదని చెప్పి అలా లేని కథను నేను తెరకెక్కించలేనని డైరెక్ట్ గా చెప్పేశాడట. అదే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చాలా గట్టిగా వినిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments