ఎన్టీఆర్ – త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్!

Wednesday, May 2nd, 2018, 10:49:34 AM IST

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలై మూడు వారాలైనా కాలేదు అప్పుడే సినిమాకు సంబందించిన వార్తలు చాలానే వస్తున్నాయి. ఇప్పటికే సినిమాలో తారక్ సరికొత్త లుక్ అందరికి మంచి కిక్ ఇస్తుందని అనేక వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు యక్షన్ సీన్స్ ఇందులో ఉంటాయని చిత్ర యూనిట్ నుంచి కూడా చెబుతోంది. ఇకపోతే రీసెంట్ గా సినిమాకు సంబందించిన మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం అందుతోంది. రెండు కుటుంబాల మధ్య రాజకీయ గొడవలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. అలాగే జగపతి బాబు – నాగబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారని టాక్ వస్తోంది. చివరలో మంచి సందేశం కూడా ఉంటుందట. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో గాని ప్రస్తుతం సినిమాకు సంబందించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరించడంలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్దే హీరోయిన్ గా కనిపించనుంది.