ఈగ – మగధీర కాన్సెప్ట్ లో రానున్న #RRR

Monday, June 4th, 2018, 05:17:50 PM IST

టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అందరి చూపు ప్రస్తుతం ఒక సినిమాపైనే ఉంది. రాజమౌళి మల్టి స్టారర్ ఎప్పుడు వస్తుందా అని దాని కోసం చర్చించుకోవడం కామన్ అయిపొయింది. పైగా రూమర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. కనీసం సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు. అప్పుడే హీరోల పాత్రల గురించి అలాగే సినిమా కథ గురించి వివిధ రకాలా గాసిప్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు కథలకు సంబందించిన కథనాలే ఎక్కువగా వస్తున్నాయి.

ముందు నుంచి #RRR కథలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరు బాక్సర్లు గా కనిపిస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. చాలా వరకు అంతా ఇదే నిజమని అనుకున్నారు. కానీ ఇటీవల రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అలాంటిదేమి లేదని చెప్పడంతో రూమర్ కి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ అయ్యింది. రాజమౌళి ఈగ – మగధీర సినిమాల్లో పునర్జన్మల పాయింట్ ను బాగా వాడిన సంగతి తెలిసిందే. అలాగే #RRR లో కూడా ఉంటుందని. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కబోయే సినిమా బడ్జెట్ 200 కోట్లు ఈజీగా దాటుతుందని టాక్. మరి రీ బర్త్ అనే కాన్సెప్ట్ ఈ సినిమాలో ఎంత కొత్తగా ఉంటుందో చూడాలి.