బిగ్ బాస్ లో నెక్స్ట్ వికెట్ ఎవరంటే ?

Sunday, September 23rd, 2018, 12:26:14 PM IST

ప్రముఖ హీరో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 తుది దశకు చేరుకుంది. టైటిల్ వేటలో 5గురు మాత్రమే ఫైనల్ చేరనున్నారు. ప్రస్తుతం హౌస్ లో 6గురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఈరోజు వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఎలిమినేషన్ ఫై రకరాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు రాపర్ రోల్ రైడ బిగ్ బాస్ హౌస్ ను వీడనున్నారు. దీప్తి , కౌశల్ , గీతామాధురి , సామ్రాట్ , తనీష్ ఫైనల్ కు వెళ్లనున్నారు.

ఇక పలు వివాదాలు దారి తీసిన ఈ సెకండ్ సీజన్ కు మరో వారంలో తెర పడనుంది. ఈ ఫైనల్ లో గెలిచిన వారు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ని అందుకొన్నారు. ఇక హౌస్ లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్ మండ ఈ బిగ్ బాస్ 2 విజేత గా నిలుస్తాడని ప్రేక్షుకులు అంచనా వేస్తున్నారు అయితే ఆయనకు గీత మాధురి నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. మరో వారంలో ఈ బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది.