వైఎస్.విజయమ్మ పాత్రలో బాహుబలి యాక్టర్

Saturday, April 28th, 2018, 10:59:03 AM IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న యాత్ర సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బయోపిక్ లో వైఎస్ పాత్రలో మమ్ముంటి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నయన తార – రాధికా ఆప్తే పేర్లు చాలా గట్టిగా వినిపించాయి. కానీ ఇటవల దర్శకుడు మహి వి రాఘవ ఆ రూమర్స్ కి చెక్ పెట్టేశాడు.

బాహుబలి సినిమాలో కనిపించిన డ్యాన్సర్ ఆశ్రిత వేముగంటి విజయమ్మ పాత్రకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కన్నా నిదురించరా అనే పాటలో తన నృత్యంతో మెప్పించిన ఆశ్రిత అనుష్కకు వదినగా కనిపించిన సంగతి తెలిసిందే. కూచిపూడి – భరత నాట్యంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె సినిమాల్లో ఎక్కువగా నటించడానికి ఇష్టపడరు.కేవలం నృత్యానికి సంబందించిన పాత్రల్లోనే కనిపిస్తానని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా యాత్ర సినిమాలో విజయమ్మ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి కొన్ని రోజుల్లో సినిమాకు సంబందించిన టీజర్ ను బయటపట్టాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments