బిగ్ న్యూస్ : ఏపీలో తాజాగా నమోదు కాబడిన కేసులు ఇవే.!

Thursday, May 21st, 2020, 12:23:29 PM IST


ఏపీలో కరోనా కేసులు పరిస్థితి రోజురోజుకు ఒక్కో రకంగా మారిపోతుంది. పైగా ఇప్పుడు కేసుల వివరాలను జిల్లాల వారీగా ఇన్నాళ్లు ప్రకటించి గత కొన్ని రోజుల నుంచి ప్రకటించకపోవడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ సానుభూతి పరులే కేసులు సమాచారం గోప్యంగా ఉంచితే మోసం వస్తుంది అంటున్నారు.

ఇప్పుడు తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు గత 24 గంటల్లో నమోదు కాబడిన కేసుల వివరాలను వెల్లడించారు. గత 24 గంటల్లో మొత్తం 8092 శాంపిల్స్ పరీక్షించగా 45 కొత్త కేసులు నమోదు అయ్యినట్టుగా నిర్ధారించారు. దీనితో ఇపుడు ఏపీలో మొత్తం 2452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఒక మరణం సంభవించగా నిన్న ఒక్క రోజులో 41 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఏ జిల్లాల వారీగా ఎక్కువ వస్తున్నాయి అన్న మిస్టరీను ఎందుకు దాచి ఉంచుతున్నారో వారికే తెలియాలి.