లేటెస్ట్ వైరల్ న్యూస్ : సెల్లు కొంటె ఉల్లి ఫ్రీ – తంజావూరు లో వినూత్న ఆఫర్

Sunday, December 8th, 2019, 11:08:48 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉల్లిపాయలకు రెక్కలొచ్చిన మాదిరిగా కనిపిస్తున్నాయి. ఉల్లిపాయల ధర రోజురోజుకు ఆకాశాన్ని అంటుతూనే ఉంటుంది. దానికి తోడు ధర ఎక్కువైనా సరే కొనుకుందామని ముందడుగు వేసినప్పటికీ కూడా ఉల్లిపాయలు కనిపించడమే కరువయ్యాయి. చివరికి విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా ఆ ఉల్లిపాయలు అందరికి అందడం లేదని చెప్పాలి. అయితే ఈనేపథ్యంలో తంజావూరు లోని ఒక ఫోన్లు అమ్మే దుకాణం ఒక అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. తమ షాపులో స్మార్ట్ ఫోన్ కొంటె వారికి కిలో ఉల్లిపాయలు ఫ్రీ అని ప్రకటనలు చేసింది.

అయితే ఈ విషయం ఆనోటా ఈ నోటా అందరికి చేరువయ్యింది. అయితే ఇప్పుడు ఉల్లిపాయల కోసమైనా ప్రజలు స్మార్ట్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఈమేరకు తాంజావూరులో ఒక మొబైల్ షాపు యజమాని తన షాపులో మొబైల్ ఫోన్ లతో పాటు ఉల్లిపాయలు కూడా మూట గట్టి పెట్టుకున్నారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొంటె వారికి కేజీ ఉల్లిపాయలు ఉచితంగా ఇస్తున్నారు కూడా. ప్రస్తుతానికి ఈ వీడియో కాస్త వైరల్ గా మారిందని చెప్పాలి. రాను రాను ఇలాంటి విచిత్రాలు ఇంకా ఎన్ని చూడాలి వస్తుందో మరి…