ఆ వార్తల్లో నిజం లేదంటున్న .. లావణ్య త్రిపాఠి ?

Tuesday, October 31st, 2017, 04:06:44 PM IST

అందాల భామ లావణ్య త్రిపాఠి కి మూడు కోట్ల ఫైన్ పడిందన్న వార్త ప్రస్తుతం మీడియాలో సంచలనం రేపింది. ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి ఈ విషయం పై స్పందించింది, తనకు మూడు కోట్ల ఫైన్ వేసినట్టు వస్తున్నా వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే .. తెలుగులో సూపర్ హిట్ అయిన 100 పర్సెంట్ లవ్ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. 100 పర్సెంట్ కాదల్ పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమా లో ముందు లావణ్య ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ తరువాత ఆ సినిమానుండి లావణ్య తప్పుకోవడంతో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ని తీసుకున్నారు. లావణ్య త్రిపాఠి వల్ల తాము చాలా నష్టపోయామని నిర్మాట్లకు కోర్టు లో కేసు వేశారని .. దానికి కోర్టు పరిహారంగా మూడు కోట్ల ఫైన్ వేసినట్టు కోలీవుడ్ లో వార్తలు జోరందుకున్నాయి. దాంతో ఈ విషయం సంచలనం రేపింది. తాజాగా ఈ విషయం గురించి స్పందించిన లావణ్య ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని .. తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments