ఆ గ్లామర్ హీరోయిన్ ఆశలన్నీ నిఖిల్ పైనే ?

Saturday, May 19th, 2018, 02:36:49 AM IST


తెలుగులో వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న ఆ హీరోయిన్ తాజాగా నటిస్తున్న సినిమా పై చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా గనక ప్లాప్ అయిందా పెట్టె బేడా సర్దేసుకోవలసిందే .. అందుకే ఆచి తూచి మరి ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? అని షాక్ అవుతున్నారా … ? ఆమె ఎవరో కాదు అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఈ మధ్య ఈ అమ్మడు సినిమాలన్నీ వరుసగా డుమ్కిలు కొడుతుండడంతో ఈ భామకు కొత్త అవకాశాలు తగ్గాయి .. అయినా ప్రయత్నాలు చేద్దామంటే అక్కడ పరిస్థితి అలాగే ఉంది .. అందుకే ఈ సారి హీరో నిఖిల్ ని నమ్ముకుంది. నిఖిల్ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. టి ఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు .. అయితే తనకు ఈ సినిమా పై చాలా నమ్మకం ఉందని .. కచ్చితంగా నిఖిల్ తనకు మంచి సక్సెస్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంది. మరి లావణ్య ఆశలను నిఖిల్ నెరవేరుస్తాడో లేదో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments