రవితేజ కి షాక్ ఇచ్చిన రాక్షసి

Thursday, February 9th, 2017, 10:19:36 AM IST


వరసగా రెండు సినిమాలు మొదలెట్టిన మాస్ మహారాజ్ రవితేజ రేస్ లోకి వచ్చేసాడు అంటున్నారు. టచ్ చేసి చూడు – రాజా దీ గ్రేట్ సినిమాల తో రవితేజ తన ఫార్మ్ లోకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు మొదలెట్టాడు. విక్రం సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న టచ్ చేసి చూడు షూటింగ్ ఇంకా మొదలు అవ్వకుండానే రవితేజ కి షాక్ ఇచ్చింది హీరోయిన్. ఈ సినిమాలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ గా అందాలరాక్షసి లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న లావణ్య.. ఇప్పుడు రవితేజ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదంటూ కారణం చెప్పి.. సున్నితంగానే టచ్ చేసి చూడు నుంచి తప్పుకుందట లావణ్య.