అవకాశం రావాలంటే వారి కోరిక తీర్చాల్సిందే : లక్ష్మి రాయ్

Thursday, November 9th, 2017, 02:32:44 PM IST

హాలీవుడ్ లో ఓ బడా నిర్మాత హీరోయిన్స్ ని వేధిస్తున్నాడనే విషయం బయటపడినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హీరోయిన్స్ అందరు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇండియాలో అయితే సినీ హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ విషయం గురించి చెప్పారు. కొందరు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో నేను కూడా అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు.

రీసెంట్ గా లక్ష్మి రాయ్ కూడా అదే తరహాలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటివి చాలా నడుస్తున్నాయని ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొదటి అవకాశం ప్రయత్నించే వారు ఒక రాత్రి గడిపితేనే అవకాశం లభిస్తుందని మరో దారి లేదని తెలిపింది. అయితే అలాంటి అనుభవం తనకు ఎదురైనపుడు ఒప్పుకోలేదని లక్ష్మి రాయ్ ఓపెన్ గా చెప్పేసింది. ప్రస్తుతం అమ్మడు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు కొంత మంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఇదే తరహా అనుభవాలను చూశామని వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments