ఈ ఫోన్ ఉంటే.. కాస్ట్‌లీ టీవీ జేబులో ఉన్న‌ట్టే!

Thursday, December 29th, 2016, 06:04:47 PM IST

lecco
అర‌చేతిలో ఇమిడిపోయేంత‌.. ఇంట్లో టీవీ చూస్తున్న‌ట్టే ఉండేటంత‌.. డాల్బీలో సౌండ్ వింటున్న‌ట్టు ఫీల‌య్యేంత‌.. జ‌స్ట్ 14000కే దొరికితే. జేబులో టీవీని వేసుకుని వెళుతున్న ఫీలింగ్ ఉంటే.. న‌వ‌త‌రం ఎక్కువ‌గా ఇలాంటి ఫోన్ల కోస‌మే వెబ్‌లో వెతుకులాడుతోంది. అలాంటి వారికి కొత్త సంవ‌త్స‌రం కానుక ఇదని చెప్పాలి. ప్ర‌ముఖ టీవీ సెట్స్ త‌యారీ కంపెనీ లీఎకో (చైనా) కూల్‌ప్యాడ్ కంపెనీతో క‌లిసి త‌యారు చేసిన మొబైల్ హ్యాండ్ సెట్ ఇది. లీఎకో- కూల్‌ప్యాడ్ సంయుక్త టెక్నాల‌జీతో వ‌స్తున్న ఈ కొత్త ఫోన్ అమెజాన్ ద్వారా జ‌న‌వ‌రి 5 నుంచి ఆన్‌లైన్‌లో మాత్ర‌మే కొనగ‌ల‌రు.

లిఏకో- కూల్ వ‌న్‌ ఫీచర్స్‌…

*స్క్రీన్: 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే,
*రిజల్యూషన్: 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 గ్రాఫిక్స్
*ర్యామ్: 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
*ఆండ్రాయిడ్: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
*కెమెరా: 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
*స్పెషల్ సెన్సార్స్: ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
*వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.1
*బ్యాటరీ: యూఎస్‌బీ టైప్-సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
*సిమ్: డుయల్ సిమ్
*బరువు: 167 గ్రాములు

  •  
  •  
  •  
  •  

Comments