సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ ఇకలేరు..!

Wednesday, November 23rd, 2016, 01:55:42 AM IST

bala-murali-krishna
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, కవి, నటుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) ఈ సాయంత్రం చెన్నై లోని తన నివాసం లో కన్నుమూశారు. 1930 జులై 6 న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన ఆయన అనతి కాలం లోనే ప్రముఖ సంగీత విద్వాంసులుగా ఎదిగారు. భారత ప్రభుత్వం నుంచి ఆయన పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఆయన ఆరేళ్ల వయసులోనే గాయకుడిగా తన సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి పలు దేశాల్లో దాదాపు ఆయన 25 కచేరీలు చేశారు.

భక్త ప్రహ్లాద చిత్రం లో నారదుడిగా నటించిన ఆయన పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. వీణ, వయోలిన్, మృదంగం వంటి వాయిద్యాలలో ఆయన ప్రావీణ్యం సాధించారు. టిడిడి, శృంగేరి పీఠాలకు ఆయన ఆస్థాన విద్వాంసునిగా కూడా పనిచేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం తో భాదపడుతున్న ఆయన కొద్దిరోజులవరకు చెన్నై లోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ఆరోగ్యం మరలా విషమించడంతో తన నివాసం లోనే నేడు మరణించారు.ఆయన మరణం తో సంగీత ప్రపంచం దిగ్బ్రాంతికి లోనైంది.