ఊర్లో పులి .. అందరూ మేడ మీదకి పరుగులు

Friday, February 17th, 2017, 12:25:41 PM IST


అడవులు నరికేసి .. అటవీ సంపద మొత్తం దోచేస్తూ ఉండడం తో వన్య ప్రాణులకి బతికే జాడ దిక్కూ లేక ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. హర్యానా లో ఒక గ్రామం లో చిరుతపులి కనపడింది. దాంతో మొత్తం గ్రామం అంతా ఆ విషయం క్షణాల్లో పకేసింది. దెబ్బకి అటవీ శాఖ అధికారులు వచ్చేలోపు గ్రామస్తులు అందరూ ఇంట్లో ఉండకుండా మేడమీదకి ఎక్కేసారు. ఇంతలో అది గ్రామం మొత్తం కలియతిరిగింది. ఎక్కడా ఏమీ దొరకకపోవడంతో మళ్లీ పార్కులోకి వచ్చేసింది. దీంతో అక్కడ మాటువేసిన అటవీశాఖాధికారులు, దానికి మత్తుమందునిచ్చి పట్టుకున్నారు. దానిని పట్టుకునే సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామస్తులు గుమికూడడం విశేషం. కాగా, మూడు నెలల క్రితం అలాగే గ్రామంలో దూరిన చిరుతను అటవీశాఖాధికారులు బంధించే ప్రయత్నం విఫలం కాగా, గ్రామస్థులు ముందుకురికి దానిని హతమార్చారు. ఈసారి అలాంటి ప్రమాదం లేకుండా అటవీశాఖాధికారులు దానిని బంధించారు. ఆరు నెలలు దానిని పరిశీలించిన పిదప దానిని అభయారణ్యంలో విడిచిపెడతామని వెల్లడించారు.