ఐ ఫోన్ కంటే ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసిన ఎల్ జీ!

Monday, July 30th, 2018, 04:51:38 PM IST

మొబైల్ రంగంలో బడా కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలిజీతో జనాలను ఆకర్షిస్తున్నాయి. ధర కూడా అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నారు. పదివేలుంటే మంచి టెక్నాలిజీ గల ఫోన్ లభిస్తోంది. అయితే ఎంతైనా కొన్ని ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ఖరీదు ఊహించని రేంజ్ కు చేరుతోంది. రీసెంట్ గా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ ఎల్.జి కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గత ఏడాది ప్రవేశపెట్టిన సిగ్నేచర్ సిరీస్ కు కొనసాగింపుగా ప్రీమియం సిగ్నేచర్ ఎడిషన్(2018)ను విడుదల చేశారు.

దీని ప్రత్యేకతల విషయం గురించి వింటే ఏ స్థాయిలో ఆశ్చర్యపోతారో తెలియదు గని ధర తెలిస్తే మాత్రం షాకవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం ఉన్న అత్యధిక ధర గల మొబైల్ ఐఫోన్ ఎక్స్ రూ.1,02,425 మాత్రమే. కానీ దానికంటే ఎక్కువ రేంజ్ లో ఈ ఫోన్ రూ.1,22,820కు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటర్, డస్ట్ ప్రూఫ్ గల ఈ మొబైల్ లో క్యూహెచ్ డీ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

6జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
మెమొరీని 2 టీబీ వరకూ విస్తరించుకోవచ్చు
బ్యాక్ సైడ్ సెన్సార్లున్న 16 మెగాపిక్సెల్ కెమెరాలు,
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ