టాలీవుడ్ లో సమ్మె సైరన్ .. లైట్స్ మెన్ మెరుపు సమ్మె ఆగిన షూటింగ్స్ ?

Tuesday, April 24th, 2018, 10:12:47 AM IST

టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. మెరుపువేగంతో లైట్స్ మెన్ సమ్మెకు దిగడంతో .. ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. తన వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిన్న సడన్ గా సమ్మె మొదలు పెట్టారు. వేతనాలతో పాటు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రారంభించిన ఈ మెరుపు సమ్మె పై నిర్మాతలు వెంటనే స్పందించారు. లైట్స్ మేన్స్ కు ఇస్తున్న వేతనాలను 25 శతం పెంచేందుకు నిర్మాతలు సంసిద్ధత వ్యక్తం చేసినా కూడా లైట్స్ మెన్ యూనియన్ ఆందోళన విరమించలేదు. తమ వేతనాలను 35 శాతం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు సమ్మె ఆపేదే లేదని వారు పేర్కొన్నారు. దాంతో నిర్మాతలు చర్చలకు సన్నాహాలు చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments