వైఎస్సార్ లాగే మహిళలకు చోటు కల్పించిన జగన్

Saturday, June 8th, 2019, 02:08:55 AM IST

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ఒక కొత్త ప్రయోగం చేశారు. తానూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలో మహిళలకు అధికశాతంలో అవకాశాన్ని కల్పించాడు. అందులో సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిని చేసేశారు. ఇతర కీలక శాఖలను కూడా మహిళలకు అప్పగించారు. మహిళలు కూడా పురుషులతో సమానమేనని భావించి తన క్యాబినేట్లో మహిళలు ఎక్కువమంది ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు… కాగా నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రిలానే ఆలోచించి తన క్యాబినెట్ కూడా ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు.

కాగా ఎస్టీ నుంచి ఒకరు, ఎస్సీ నుంచి ఇద్దరిని చోటు కల్పించారు జగన్. ఉత్తరాంధ్రా నుంచి విజయనగరం జిల్లాకు చెందిన చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీ వాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తానేటి వనిత, గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరితలకు జగన్ చాన్స్ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు మహిళలకు తన కేబినెట్లో కీలకమైన శాఖలు ఇస్తారని, కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని పుష్ప శ్రీవాణికి ఇస్తున్నార్నయి ఇప్పటికే తేల్చేశారని సమాచారం. అంతేకాకుండా హోం, ఆర్ధిక, రెవిన్యూ లాంటి కీలకమైన శాఖలు వీరిలో ఒకరికి లభిస్తాయని అంటున్నారు. మరి జగన్ కూడా తన తండ్రి లా ప్రయోగాన్ని విజయవంతం చేస్తాడా లేక మరేదైనా ప్లాన్ వేశాడా అనేది చూడాలి.