వీడియో : సింహాన్ని టచ్ చేస్తే ఇలానే ఉంటుంది..చావును చూసొచ్చాడు

Saturday, September 30th, 2017, 04:59:07 PM IST

ఎంత పెంచుకున్న వన్య మృగాలైనా ఒక్కోసారి కోపం వస్తే ఏ మాత్రం జాలి లేకుండా దాడి చేస్తాయి. రీసెంట్ గా అదే తరహాలో ఓ సింహం ఉన్నట్టే ఉండి ఓ వ్యక్తికి చేదు అనువబావాన్ని మిగిల్చింది. అసలు వివరాల్లోకి వెళితే.. దక్షిణాప్రికాలో జరిగే రగ్బీ క్రీడల్లో పాల్గొనేందుకు స్కాట్‌ బల్‌ద్విన్‌ అనే రగ్బీ క్రీడాకారుడు తన టీంతో కలిసి వెళ్ళాడు. మ్యాచ్ ముందు రోజు సరదాగా అక్కడ సమీపాన ఉన్న ప్రాంతాలన్నీ తీరిగారు. అలాగే అక్కడ ప్రసిద్ధి చెందిన సింహాలను పెంచే ఒక పార్క్ ఉంది.

బోనులోనే ఉన్న ఆ సింహాలను ఆటగాళ్లంతా ఎంతో ఇష్టంగా చూసారు. అదే విధంగా వాటిని చేతితో నిమురుతూ ఉన్నారు. అయితే స్కాట్‌ బల్‌ద్విన్‌ మాత్రం సింహం తలను నిమిరాడు. దీంతో అప్పటివరకు బాగానే ఉన్న మృగరాజు ఒక్కసారిగా చేతిని కోరికేసింది. దీంతో స్కాట్‌ భయపడిపోయి గట్టిగా అరచి మొత్తానికి దాని నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిన్న గాయాలతో బయటపడి ఉపిరిపీల్చుకున్నాడు. గాయం కారణంగా అతను తర్వాత మ్యాచ్ కు దూరమయ్యాడు.

Comments