ఆ సినిమాను మహిళలు కూడా ఛీ కొట్టారట !!

Monday, February 27th, 2017, 10:32:26 AM IST


ఆ సినిమాను మగవాళ్లే కాదు మహిళలు కూడా ఛీ కొట్టిన ఘటన బాలీవుడ్ సంచలనం రేపుతోంది!! ఈ సినిమాను సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేయడానికి నో చెప్పడమే కాదు .. మేము చెయ్యలేము బాబోయ్ అన్నారట !! అవునా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు .. ఆ వివరాల్లోకి వెళితే ”లిపిస్టిక్ అండర్ మై బురఖా” అనే చిత్రాన్ని మహిళా దర్శకురాలు అలాకృత శ్రీవాస్తవ తెరకెక్కించారు. బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్ ప్రకాష్ ఝు నిర్మించిన ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు అడ్డు చెప్పారు. సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేయమని చెప్పడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్త్రీ వాద సినిమాల కావడం వల్లనే ఈ సినిమాపై వివక్ష చూపుతున్నారని వాదనను సెన్సార్ బోర్డు సి ఈ ఓ అనురాగ్ శర్మ ఖండించారు? ఈ సినిమాను రెండు కమిటీలు చూసినట్టు .. అందులో మహిళలు కూడా ఉన్నారని, వాళ్ళు సినిమా చూసి ఛీ కొట్టారని, అలాంటి సినిమాను ఎలా సెన్సార్ చేయాలనీ చెప్పారు. అసలు ఆ సినిమాలో ఏముందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ? ఈ సినిమాలో సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉందని, అస్లీల పదజాలం, ఆడియో ఫోర్నోగ్రఫీ, ముఖ్యంగా ఓ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని అందుకే ఈ సినిమాను సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందని సమాచారం. మరో వైపు ప్రకాష్ ఝు తీవ్రంగా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దేశం మొత్తం ప్రోత్సహిస్తుంటే, అసౌకర్యంగా ఉన్న కథలంటూ సెన్సార్ నిరుత్సహానికి గురి చేస్తుందని అయన అన్నారు. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి !!