నన్ను వదిలేస్తే మీ అప్పులన్ని తీర్చేస్తా – లిక్కర్ కింగ్ సంచలన వాఖ్యలు

Tuesday, March 31st, 2020, 02:42:36 PM IST

చాలా రోజుల తరువాత ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మళ్ళీ ఒక కొత్త రకమైన సందేశంతో వార్తల్లోకి వచ్చాడు. దేశంలోని ప్రముఖ బ్యాంకులను మోసగించి, అనవసరమైన వ్యాపారాలను ప్రారంభించి, చివరికి గతిలేక దేశం విడిచి పారిపోయి, విదేశాల్లో చాటుగా బ్రతుకుతున్న విజయ్ మాల్యా, ఎప్పటికప్పుడు అందరితో టచ్ లోనే ఉంటున్నాడు. కాగా ప్రస్తుతానికి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా, ప్రజలందరికి కొన్ని నీతి వాఖ్యాలు చెబుతూ, తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా కొన్ని పోస్టులు పెట్టారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటాలని, మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలని, అందరిలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని విజయ్ మాల్యా వాఖ్యానించారు.

ఇక ప్రత్యేకంగా తాను ట్వీట్ చేసిన పోస్టుల గురించి చెప్పుకోవాలంటే… తన అప్పుల గురించి ప్రస్తావించిన విజయ్ మాల్యా, తొందర్లోనే తన అప్పులన్నీ తీర్చేస్తానని, కానీ తన విన్నపాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, బ్యాంకులతో పాటే ఈడీ కూడా తన మాట వినడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జప్తు చేసిన తన ఆస్తులను కూడా విడుదల చేయాలనీ కోరుకున్నారు. ఒకవైపు భయంకరమైన కరోనా వైరస్ కారణంగా పరిస్థితి చిన్నాభిన్నం అవుతున్న తరుణంలో నైనా తన ఆవేదనని, విన్నపాన్ని అర్థం చేసుకోవాలని విజయ్ మాల్యా తన ట్విట్టర్ వేదిక ద్వారా భారత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.