ముద్దు వరకూ వెళ్లారు..పెళ్లివరకు వెళతారా..?

Wednesday, September 28th, 2016, 06:12:21 PM IST

k
బాలీవుడ్ లో హీరోయిన్స్ పెళ్లి విషయాలు ఎప్పుడు ఎలా, ఎవరితో ఉంటాయో చెప్పడం కష్టం. ఎందుకంటే వారి ప్రేమాయణాలు అలా మారిపోతుంటాయి మరి !! ఇక సౌత్ లో పుట్టి అమెరికా, ఆస్ట్రేలియాలో పెరిగి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన గ్లామర్ ఆకట్టుకున్న లీసా హైడెన్ గుర్తుందిగా, ‘క్వీన్’, ‘హౌస్ ఫుల్ 3’, సినిమాల్లో నటించి బికినీలు, హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకున్న లీసా గత కొన్ని రోజులుగా ఈమె ప్రముఖ వ్యాపారవేత్త గుల్లు లల్వాని తనయుడు డినో లల్వాని తో ప్రేమాయణం సాగిస్తుంది. అయితే త్వరలోనే ఈ భామ పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియా లో తెలియచేసింది, పైగా ఇద్దరు ముద్దుపెట్టుకునే ఫోటో పెట్టి షాక్ ఇచ్చింది? అంత బాగానే ఉంది కానీ పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.