లైవ్ వీడియో : ‘రంగస్థలం’ సక్సెస్ మీట్

Friday, April 13th, 2018, 07:56:21 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా, వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజాగా సూపర్ హిట్ ‘రంగస్థలం’. ఇప్పటికే విడుదలయిన ప్రతీ చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో చాలా చోట్ల రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను మూడు రోజుల క్రితం వీక్షించిన చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రం చాలా బాగుందని, అలానే చిత్రంలో చరణ్, సమంత ఇతర నటులందరూ బాగా చేశారని మెచ్చుకున్నారు. అయితే నేడు జరగనున్న ఈ సినిమా సక్సెస్ మీట్ కు పవన్, అలానే మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. దిగువ ఇచ్చిన లింక్ ద్వారా మీరు కూడా ఆ లైవ్ ని చూడవచ్చు….

  •  
  •  
  •  
  •  

Comments