కోట్లలో రుణాలు కొట్టేసిన బోగ‌స్ రైతులు!

Saturday, February 18th, 2017, 08:44:57 PM IST


రైతుల పేరుతో రుణాలు కొట్టేశారు. ల‌క్ష‌ల్లో కాదు.. కోట్ల‌లో కొట్టేశారు! రైతు పేరుతో బినామీ రుణాలు సంపాదించి బ్యాంకుల‌కు అప్పు చెల్లించ‌కుండా ఎగ‌వేసేందుకు ప్లాన్ చేశారు. ఇదోర‌కం ద‌ర్జా దందా. ఈ దందా తెలంగాణలో వెలుగు చూసింది. రైతుల‌ పేరుతో బినామీలు ల‌క్ష‌ల్లో అప్పు తీసుకుని ఎగ‌వేసేందుకు ప్లాన్ వేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేస్తుండ‌డంతో ఆ అప్పు మొత్తం తిరిగి చెల్లించాల్సిన ప‌నే లేకుండా పోయింది.

అయితే దొంగ‌త‌నం ఎంతో కాలం దాగ‌దు! అన్న‌ట్టే ఈ బినామీల తంతు బ‌య‌ట‌ప‌డిపోయింది. ఆరా తీస్తే దిమ్మ‌తిరిగే నిజాలు తెలిసొచ్చాయి. ఇలా బినామీలు బొక్కేసిన మొత్తం కొన్ని కోట్ల‌లో ఉంద‌ని ప్ర‌భుత్వ ం లెక్క‌లు తేల్చింది. దీంతో వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సిందిగా పోలీసుల‌ను రంగంలోకి దించారు. ప్ర‌స్తుతం బోగ‌స్ రైతులు ఎవ‌రెవ‌రు? ఎంతెంత కొట్టేశార‌న్న దానిపై ఆరాలు తీస్తున్నారు. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్ త‌దిత‌ర చోట్ల ఈ దందా ఎక్కువ‌గా జ‌రిగింద‌ని క‌నుగొన్నారు. దొంగ‌లు దొరికిపోతున్నారు కాబ‌ట్టి బినామీల్లో ఒక‌టే గుబులు మొద‌లైంద‌ని చెబుతున్నారు.