మాజీ ఎంపీ కవిత కి షాక్ – నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా…?

Tuesday, March 24th, 2020, 09:00:52 PM IST

గత కొంత కాలంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దారుణంగా వ్యాపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ భయంకరమైన వైరస్ వ్యాపిస్తున్న కారణంగా మన దేశంలో ప్రస్తుతానికి జరగనున్నటువంటి అన్ని రకాల స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత బరిలో నిలిచినా సంగతి మనకు తెలిసిందే.

కాగా అధికార తెరాస నుండి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. వీరితో పాటు మరొక 7 మంది నామినేషన్లు వేశారు… అయితే వీరిలో ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లను ఇప్పటికే అధికారులు తిరస్కరించారు. అంతేకాకుండా లోయపల్లి నర్సింగ్‌రావు శనివారం, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే లెక్క ప్రకారం వచ్చే నెల 7 న ఈ ఎన్నికలు జరగాల్సింది. కానీ కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నూతన షెడ్యూలేని త్వరలోనే విడుదల చేయనున్నారు.